గత వారం చిత్రాల పరిస్థితి ఇదే

గత వారం చిత్రాల పరిస్థితి ఇదే

Published on Apr 22, 2024 1:07 PM IST

గత వారం రిలీజ్ అయిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోయాయి. ఫలితంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ ఏప్రిల్ నెలలోనే మరో పేలవమైన వారాంతాన్ని చవిచూడాల్సి వచ్చింది. నిజానికి పోయిన శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కాలేదు. పారిజాత పర్వం, టెనెంట్, మార్కెట్ మహాలక్ష్మి, మరియు తెప్ప సముద్రం వంటి చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. ఎలాంటి బజ్‌ లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

థియేటర్లలో బాగానే విడుదలైనప్పటికీ, సినిమాల్లో ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాలను పట్టించుకోలేదు. ఎలాగూ మేకర్స్ కూడా తమ ప్రమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. దీంతో.. గత శుక్రవారం తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హడావుడి లేకుండా పోయింది. ఐతే, నాని జెర్సీని మళ్లీ విడుదల చేయడంతో ఆ సినిమా పై కొందరు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు