ఇకపై మరింత శ్రద్ధ, దీక్షతో మా కాంబో సినిమాలకు పనిచేస్తాము – ‘లెజెండ్’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో బోయపాటి శ్రీను

ఇకపై మరింత శ్రద్ధ, దీక్షతో మా కాంబో సినిమాలకు పనిచేస్తాము – ‘లెజెండ్’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో బోయపాటి శ్రీను

Published on Mar 28, 2024 11:20 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నటసింహం బాలకృష్ణ హీరోగా రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన యాక్షన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్. సరిగ్గా ఇవాళ్టికి పదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయం అందుకోవడంతో పాటు ఒక థియేటర్ లో ఏకంగా మూడేళ్లు ఆడింది. ఇక నేటితో ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకోవడంతో హైదరాబాద్ లో మూవీ యూనిట్ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, టాలీవుడ్ లో రియల్ లెజెండ్ ఒక్కప్పటి స్టార్ నటులు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు గారు అని అన్నారు. అందుకే ఆయనని స్మరిస్తూ ఈ మూవీ ప్రారంభంలో చూపించడం జరిగిందన్నారు. ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణ గారితో పాటు టీమ్ మొత్తం కూడా ఎంతో కష్టపడి పని చేసారని, అందుకే బాలయ్య ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మూవీకి విశేషమైన రెస్పాన్స్ లభించిందని, ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక పై తమ కాంబినేషన్ లో రానున్న సినిమాలకు మరింత శ్రద్ద, దీక్షతో పని చేస్తాం అని, బాలయ్యతో మరిన్ని సినిమాలు చేయాలనేది తన ఆలోచన అన్నారు బోయపాటి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు