ఆగష్టు చివరి నుంచి పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’

ఆగష్టు చివరి నుంచి పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’

Published on Jul 21, 2014 8:38 AM IST

pawan
2014 ఎన్నికలలో బాగా చురుకుగా పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత సినిమా షూటింగ్స్ తో బిజీ అయిపోతాడు అనుకుంటే షూటింగ్స్ కి కూడా విరామం ఇచ్చాడు. పవన్ నటించాల్సిన ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా చాలా కాలం క్రితమే లాంచనంగా ప్రారంభమైంది కానీ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చాలా కాలం నుంచి సెట్స్ పైకి వెళ్ళకుండా వాయిదా పడుతూ వస్తోంది.

మేము తాజాగా ఈ చిత్ర టీంలోని ప్రముఖులను సంప్రదించగా ‘గబ్బర్ సింగ్ 2’ని ఆగష్టు 3వ వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలియజేశారు. సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది.

‘గబ్బర్ సింగ్ 2’ కాకుండా వెంకటేష్ తో కలిసి పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’లో కూడా నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

తాజా వార్తలు