‘కల్కి 2898 ఏడి’ : అక్కడి వరుస అప్ డేట్స్ షురూ

‘కల్కి 2898 ఏడి’ : అక్కడి వరుస అప్ డేట్స్ షురూ

Published on Feb 26, 2024 10:12 PM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్రాండియర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మే 9న ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ బజ్ ప్రకారం అతి త్వరలో ఈ మూవీ టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అలానే ఇప్పటికే దాని రన్ టైం కూడా లాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి నుండి వరుసగా కల్కి మూవీ అప్ డేట్స్ ఒక్కొక్కటిగా వస్తూనే ఉంటాయట, ప్రమోషన్స్ విషయంలో టీమ్ గ్రాట్టి ప్రణాళికలు రచిస్తోందట. మే 9న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న మూవీ తప్పకుండా భారీ సక్సెస్ అందుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ అనంతరం ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు