నైజాం మార్కెట్ లో ఇక నుంచి ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ నడుమ షేర్ లు

నైజాం మార్కెట్ లో ఇక నుంచి ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ నడుమ షేర్ లు

Published on May 22, 2024 12:00 AM IST

మళ్లీ చాలా కాలం తర్వాత సినిమాలు కొరత మూలన థియేటర్స్ ని స్వచ్చందంగా తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి అది కూడ మన తెలుగు రాష్ట్రాల్లో చూడడం జరిగింది. అయితే ఇది మరీ ముఖ్యంగా నైజాం ప్రాంతంలో కనిపించింది. దీనితో తాజాగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ మే 21న తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు నిర్వహించిన మీటింగ్ లో శిరీష్ రెడ్డి ఫంగారు (శ్రీ. వెంకటేశ్వరా ఫిలిమ్స్, SVC సినిమాస్, సునీల్ నారంగ్ గారు (ఆసియన్ థియేటర్స్, గ్లోబల్ ఫిల్మ్స్ అలాగే పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సహా ఎగ్జిబిటర్స్ ఈ మీటింగులో ఎక్సహిబిటర్ల మనుగడ కొరకు చర్చించడము జరిగినది.

సినిమా థియేటర్స్ మూతబడకుండా కాపాడుకోవడానికి తమలో తాము తీసుకున్న నిర్ణయం ద్వారా ఇక నుంచి నైజాం మార్కెట్ లో సినిమాలకి ఆయా చిత్రాల హక్కుల మొత్తం ఆధారంగా ఈ క్రింది విధంగా మాత్రమే షేర్ లు పంచుకోవడం జరుగుతుంది.

1 .) 30 కోట్ల పైబడి నైజాం హక్కులు కలిగి ఉంటే..

మొదటి వారం: (75 % డిస్ట్రిబ్యూటర్ కి, 25% ఎక్సిబిటర్.)
రెండవ వారం: (55 % డిస్ట్రిబ్యూటర్, 45% ఎక్సిబిటర్.)
మూడవ వారం: 40 % డిస్ట్రిబ్యూటర్, 60% ఎక్సహిబిటర్. నాలుగవ వారం నుండి 30% డిస్ట్రిబ్యూటర్, 70% ఎక్సిబిటర్ కి వచ్చేలా నిర్ణయించడం అయ్యింది.

2 .) 10 కోట్ల నుండి 30 వరకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఈ క్రింది విధముగా % షేర్ అంగీకరించబడినది.

మొదటి వారం: (60 % డిస్ట్రిబ్యూటర్, 40% ఎక్సిబిటర్.)

రెండవ వారం : (50 % డిస్ట్రిబ్యూటర్, 50% ఎక్సిబిటర్.)

మూడవ వారం: (40 % డిస్ట్రిబ్యూటర్, 60% ఎక్సిబిటర్.) నాలుగవ వారం నుండి (30% డిస్ట్రిబ్యూటర్, 70% ఎక్సిబిటర్. )

3 .) 10 కోట్ల లోపు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఈ క్రింది విధముగా % షేర్ అంగీకరించబడినది.

మొదటి వారం: (50 % డిస్ట్రిబ్యూటర్, 50% ఎక్సిబిటర్.)

రెండవ వారం: (40% డిస్ట్రిబ్యూటర్, 60% ఎక్సిబిటర్ )

మూడవ వారం నుండి : (30% డిస్ట్రిబ్యూటర్, 70% ఎక్సిబిటర్) కి రానున్నాయి.

అయితే ఈ పైన పేర్కొన్న పర్సంటేజ్ విధానము 1వ తేదీ జూలై 2024 నుండి అమలు చేయుటకు తమలో తాము తీసుకున్న నిర్ణయం గా ఇప్పుడు వెల్లడి చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు