యుంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆలాగే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల సరసన వరసగా అవకాశాలు వస్తున్నాయట ఈ బ్యూటీకి. ఈ క్రమంలోనే హీరో నితిన్ కొత్త చిత్రంలో కృతి శెట్టి సెకెండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అని తెలుస్తుంది. అలాగే మరో సినిమాలో కూడా నటించబోతుందట.
నాగశౌర్య హీరోగా రాబోయే ఓ చిత్రంలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మరి ఈ రెండు సినిమాల్లో తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు కృతి శెట్టికి ఇంకా పెరగడం ఖాయం. అలాగే తాజాగా సూర్య – హరి కలయికలో రాబోతున్న యాక్షన్ డ్రామాలో కూడా కృతి శెట్టికి హీరోయిన్ గా అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.
