వెంకీ కెరీర్ లోనే ఫుల్ మాస్ అట !

వెంకీ కెరీర్ లోనే ఫుల్ మాస్ అట !

Published on Mar 28, 2021 11:01 PM IST

Narappa 1

విక్టరీ వెంకటేష్‌ ‘నారప్ప’ సినిమా ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో వెంకీ మాస్ లుక్ చాలా ఇంటెన్స్ ‌గా ఉంటుందని.. అలాగే మాస్‌ గెటప్‌లో వెంకీ చేసిన యాక్షన్ సీన్స్ కూడా పూర్తి వైవిధ్యంగా ఉంటూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తాయని తెలుస్తోంది. మొత్తానికి వెంకీ కెరీర్ నే నారప్ప ఫుల్ మాస్ మూవీ అట.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో వెంకీ లుక్ కి ట్రెమండస్‌ రెస్పాన్స్ ‌ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు