విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’. దర్శకుడు కెవి అనుదీప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్ కి చాలా కీలకం కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా.. ఇలా వరుసగా ప్లాప్స్ తర్వాత విశ్వక్ సేన్ నుంచి రాబోతున్న సినిమా ‘ఫంకీ’. కాబట్టి, ఫంకీ సినిమా కచ్చితంగా హిట్ అయితేనే విశ్వక్ సేన్ కి మార్కెట్ నిలబడుతుంది. మరి ఈ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ట్రైలర్ అయితే అంచనాలను పెంచేసింది.
ఇక ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది. కయాదు లోహర్ – విశ్వక్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అట. సినిమాలో పెద్దగా కథ లేకపోయినా.. కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ పేలాయి అని తెలుస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.


