నితిన్ కష్టపడుతుంటే కీర్తి సురేష్ నిద్రపోతోంది !!

Published on Nov 27, 2020 12:09 am IST

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం ఇటీవలే షూటింగ్ రీస్టార్ట్ చేసుకుంది ఈ చిత్రం. తాజాగా లొకేషన్లో ఒక సరదా సన్నివేశాన్ని షేర్ చేశారు నితిన్. షాట్ గ్యాప్లో కీర్తి సురేష్ చెట్టు కింద కుర్చీ వేసుకుని ముఖం మీద కర్చీఫ్ వేసుకుని చిన్న కునుకు తీసింది. అది గమనించిన నితిన్ నిద్రపోతున్న కీర్తి సురేష్ వెనుక నిలబడి వెంకీ అట్లూరితో కలిసి ఫొటో తీసుకుని మేము కష్టపడి చెమటలు కక్కుతుంటే కీర్తి సురేష్ మాత్రం ఇలా రిలాక్స్ అవుతోంది అంటూ ట్వీట్ వేశారు.

దానికి స్పందించిన కీర్తి సురేష్ మీకు అసూయగా ఉంది కదా.. చెప్పండి అంటూ తనదైన శైలిలో కౌంటర్ వేశారు. అది చూసిన నెటిజన్లు మీ టామ్ అండ్ జెర్రీ ఫైట్ బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సితార ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.డి.వి.ప్రసాద్ సమర్పకులు. సుప్రసిద్ధ డీవోపీ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన సినిమా పాటలకు, ప్రొమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత సమాచారం :

More