
ఈ శివరాత్రికి విడుదలకానున్న సినిమాల్లో ‘గాలి సంపత్’ కూడ ఒకటి. రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అనీష్ కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి కథను అందించారు. అలాగే షైన్ స్క్రీన్ సంస్థతో కలిసి నిర్మాతగానూ వ్యవహరించారు. పాటలు, ట్రైలర్లతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం మంచి అంచనాల నడుమ విడుదలకానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడ బాగున్నాయి.
యూఎస్లో కూడ సినిమా మంచి స్థాయిలోనే విడుదలవుతోంది. మొత్తం 100కు పైగా లొకేషన్లలో సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. కరోనా ప్రభావంతో మంచి స్థాయిలో ఉండే తెలుగు సినిమా ఓవర్సీస్ మార్కెట్ బాగా దెబ్బతింది. ఇండియాలో అయితే మార్కెట్ కోలుకుంది కానీ యూఎస్లో కోలుకోలేదు. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సైతం సినిమాలు కోనేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఇలాంటి తరుణంలోనే ‘గాలి సంపత్’ మంచి స్థాయిలో రిలీజ్ అవుతుండటం అక్కడి మార్కెట్ కు మునుపటి ఊపునిచ్చేలా కనిపిస్తోంది.