
యాంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ రాజేంద్ర ప్రసాద్ శ్రీవిష్ణు తండ్రిగా నటిస్తున్నారు. టైటిల్ రోల్ చేస్తున్నది ఆయనే. ఇటీవలే అధికారికంగా లాంఛ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. టైటిల్ వెరైటీగా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి క్రియేట్ అయింది. చిత్రానికి అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే కూడ అందిస్తుండటం విశేషం.
‘పటాస్, సరిలేరు నీకెవ్వరు’ లాంటి చిత్రాలను రచయితగా పనిచేసిన ఎస్. కృష్ణ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ‘మజిలీ, టక్ జగదీష్’ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీవిష్ణుకు జోడీగా లవ్లీ సింగ్ నటిస్తోంది. భిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు ఈ కథను ఓకే చేయడం, అనిల్ రావిపూడి లాంటి ఎంటర్టైనింగ్ డైరెక్టర్ కథనాన్ని అందిస్తుండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.