
యంగ్ హీరో ఆది ప్రస్తుతం తను చేస్తున్న ‘గాలిపటం’ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ‘రచ్చ’ సినిమా డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారి తన అసిస్టెంట్ నవీన్ గాంధీని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు.
ఈ సినిమా అగురించి ఆది మాట్లాడుతూ ‘గాలిపటం సినిమా రెగ్యులర్ టాలీవుడ్ ఎంటర్టైనర్ కాదు. ఇది పూర్తి విభిన్నమైన సినిమా. అలాగే సౌత్ లోనే ఇలాంటి సినిమా రావడం ఇందే ప్రధమం. యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని’అని అన్నాడు.
అలాగే ఈ చిత్ర నిర్మాత సంపత్ నంది కూడా సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రష్యన్ మోడల్ క్రిస్టిన అఖీవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రాహుల్ రవీంద్రన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.