ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో కొనసాగుతున్న ‘గామి’

ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో కొనసాగుతున్న ‘గామి’

Published on Apr 15, 2024 2:42 PM IST


యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా యువ దర్శకుడు విద్యాధర్ కాగిత దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ గామి. ఇక ఇటీవల బాగా అంచనాలతో థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించే విజయం అందుకుంది.

ఈ మూవీని కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్, విఆర్ గ్లోబల్ మీడియా, శ్వేత వాహిని స్టూడియోస్ లిమిటెడ్, క్లౌన్ పిక్చర్స్ సంస్థల పై కార్తీక్ శబరీష్, శ్వేతా మొరవనేని గ్రాండ్ గా నిర్మించారు. విషయం ఏమిటంటే, తాజాగా జీ 5 ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చిన గామి మూవీ మంచి రెస్పాన్స్ తో టాప్ లో కొనసాగుతోంది. మొత్తంగా తమ మూవీకి ఓటిటి ఆడియన్స్ నుండి బాగా స్పందన లభిస్తుండడంతో గామి టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు