
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ పై దాదాపు ఏడాది పాటూ వార్తలు వస్తూనే వున్నాయి. దర్శకుడు మారడం, పవన్ రాజకీయ ప్రవేశం, హీరోయిన్ కోసం వెతుకులాటతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పవర్ సినిమాను తెరకెక్కించిన కె.ఎస్ రవీంద్ర ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ఖరారయింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మే 4 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పాత్రతో పోలిక లేకుండా చాలా పకడ్బందీగా చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పవన్ స్నేహితులలో ఒకరైన శరత్ మరార్ ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు