పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’కి హీరోయిన్ దొరికేసింది.!

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’కి హీరోయిన్ దొరికేసింది.!

Published on Nov 13, 2014 4:26 PM IST

pawan_anisha-ambrose
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే ఈ సినిమా సీక్వెల్ అనౌన్స్ చేసారో అప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా.? ఎవరు డైరెక్ట్ చేస్తారు.? ఎవరు హీరోయిన్ అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఆ విషయాలపై నేడు ఈ చిత్ర టీం క్లారిటీ ఇచ్చారు.

ఆసలు విషయంలోకి వెళితే.. ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కె. రవీంద్ర (బాబీ) పవన్ కళ్యాణ్ నటించనున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం తెలుగమ్మాయి అనీష అంబ్రోసే హీరోయిన్ గా నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. అనీష మొదటగా అలియాస్ జానకి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అటు డైరెక్టర్ బాబీకి మరియు ఇటు హీరోయిన్ అనీషకి రెండవ సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే చాన్స్ కొట్టేసి ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచారు. శరత్ మరార్ నిర్మించనున్న ఈ సినిమాని 2015 మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు