
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్, స్టామినాలను బాక్సాఫీస్ వద్ద ఘనంగా చాటి చెప్పిన సినిమా ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించడానికి పవన్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మార్క్ హీరో క్యారేక్టరైజెషన్ కు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 14 నుండి ప్రారంభమవుతుందని సమాచారం. అక్టోబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘పవర్’ ఫేం కె.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో అనిషా ఆంబ్రోస్ హీరోయిన్. పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఎరోస్ ఇంటర్నేషనల్స్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ‘గబ్బర్ సింగ్ 2’ను తెరకేక్కిస్తున్నాయి.

