గబ్బర్ సింగ్ కి మరోసారి భారీ క్రౌడ్స్.!

గబ్బర్ సింగ్ కి మరోసారి భారీ క్రౌడ్స్.!

Published on Mar 11, 2013 8:20 AM IST

Gabbar-Singh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా గత సంవత్సరం విదుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలై సంవత్సరం కావస్తున్నా మళ్ళీ రిలీజ్ చేసిన ఈ సినిమాకి క్రౌడ్స్ బాగా ఎక్కువగా వచ్చారు.

ఏంటి సినిమా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయ్యిందా అనే అయోమయ స్థితిలో పడ్డారా? విషయంలోకి వెళితే నిన్న మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రం అంతటా అంతటా చాలా థియేటర్లలో ‘గబ్బర్ సింగ్ ‘ స్పెషల్ షొస్ వేసారు. అన్ని చోట్లా క్రౌడ్స్ ఫుల్ గా వచ్చారు. హైడరాబాద్ కూకట్ పల్లిలో హౌస్ ఫుల్ షొస్ పడ్డాయి.

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

షొస్ ఇంతలా ఫుల్ అవ్వడం చూస్తుంటే ‘గబ్బర్ సింగ్ ‘ సినిమా పవన్ కల్యాణ్ అభిమానుల్లో మరియు మూవీ లవర్స్ పై ఎంతటి ప్రభావం చూపిందో తెలుస్తోంది. ఇదంతా చూసిన తర్వాత ఒక్క డైలాగ్ చెప్పాలనిపిస్తోంది ‘బొమ్మ వచ్చి సంవత్సరం అయ్యింది , అయినా ఏ మాత్రం పవర్ తగ్గలేదు’.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు