నేటి నుండి పవన్ టైటిల్ సాంగ్ షూటింగ్

నేటి నుండి పవన్ టైటిల్ సాంగ్ షూటింగ్

Published on Apr 20, 2012 8:18 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం మంచి అంచనాలతో ముందు వెళ్తోంది. ఈ చిత్రం టాకీ భాగం ఇప్పటికే పూర్తి అవగా, ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. నేటి నుండి పవన్ పై ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ ను చిత్రీకరిస్తారు. గచిబౌళి కి దగ్గరలో ఉన్న అలుమినియం ఫ్యాక్టరీ లో ఈ పాత చిత్రీకరణ జరుగుతుంది. గణేష్ మాస్టర్ ఈ పాటకు పర్యవేక్షణ అందిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ఇప్పటికే మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు కాగా, బండ్ల గణేష్ బాబు నిర్మాత. శృతి హాసన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా కనపడుతుంది. ఈ చిత్రం భారీ అంచనాలతో, మే 9న విడుదల అయ్యేందుకు సిద్ధపడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు