గబ్బర్ సింగ్ కోసం మూడు పాటలు సిద్ధం చేసిన దేవీ శ్రీ ప్రసాద్

గబ్బర్ సింగ్ కోసం మూడు పాటలు సిద్ధం చేసిన దేవీ శ్రీ ప్రసాద్

Published on Nov 23, 2011 5:40 AM IST


పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తరువాత చిత్రం ‘గబ్బర్ సింగ్’ కోసం దేవీ శ్రీ ప్రసాద్ మూడు పాటలు రికార్డింగ్ పూర్తి చేసారు. జల్సా తరువాత చాల రోజులలకి పవన్ కళ్యాణ్ సినిమాకి దేవీ సంగీతం అందిస్తున్నాడు. జల్సా చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన దేవీ శ్రీ, ‘గబ్బర్ సింగ్’ కోసం అధ్బుతమైన పాటలని అందిచాడని సాహిత్యం కూడా సరిగ్గా కుదిరిందని చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. సల్మాన్ ఖాన్ నటించిన హిందీ చిత్రం దబాంగ్ చిత్రాన్ని తెలుగులో గబ్బర్ సింగ్ గా తీస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు నేటివిటీకీ తగ్గట్లుగా స్క్రిపులో కొన్ని మార్పులు చేసినట్లుగా హరీష్ శంకర్ చెప్పారు. పవన్ కళ్యాణ్కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు