తెలుగులో “గదర్ 2”..వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్.!

తెలుగులో “గదర్ 2”..వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్.!

Published on Feb 11, 2024 10:05 AM IST

గత ఏడాదిలో బాలీవుడ్ సినిమా అందుకున్న కం బ్యాక్ ఏ లెవెల్లో ఉందో చూసాం. మరి జనవరి నుంచే పలు భారీ హిట్స్ బాలీవుడ్ అందుకుంటే అందులో రెండు ఇండస్ట్రీ హిట్స్ బాలీవుడ్ మార్కెట్ లో పడ్డాయి. మరి అలా వసూళ్లతో సంచలనం రేపిన చిత్రాల్లో బాలీవుడ్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “గదర్ 2” కూడా ఒకటి.

నటుడు సన్నీ డియోల్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్ గా నటించిన హిట్ గదర్ కి దాదాపు 2 దశాబ్దాల తర్వాత వచ్చిన సీక్వెల్ అయినప్పటికీ ఈ చిత్రం హిందీలో రికార్డు వసూళ్లు అందుకొని భారీ హిట్ అయ్యింది. మరి అప్పట్లో ఈ సినిమాని తెలుగులో కూడా చూడాలి అని కొంతమంది అనుకున్నారు.

మరి అప్పుడు తెలుగులో అయితే బుక్ మై షో వారు స్ట్రీమింగ్ కి తీసుకురాగా ఇపుడు బుల్లితెర ప్రేక్షకులని ఈ చిత్రం అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఈ చిత్రం తెలుగులో జీ తెలుగు ఛానెల్ లో ఈ ఫిబ్రవరి 18న అయితే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఆరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి అయితే జీ తెలుగులో ఈ చిత్రం రానుంది. మరి ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు