‘గద్దలకొండ గణేష్’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ !

‘గద్దలకొండ గణేష్’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ !

Published on Sep 22, 2019 10:50 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం ‘గద్దలకొండ గణేష్’ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఓవర్సీస్లో మాత్రం సాధరణంగానే రన్ మొదలుపెట్టింది. ఈ చిత్రం గురువారం నాడు ప్రీమియర్ల నుండి, $ 84,981 డాలర్స్ ను మరియు శుక్రవారం నాడు $ 79,753 డాలర్స్ ను వసూలు చేసింది. మొత్తం మీద శుక్రవారం నాటికి ఈ సినిమా $ 164,734 డాలర్స్ రాబట్టింది.

కాగా శనివారం నాడు, రాత్రి 9 గంటల వరకూ, మొత్తం 127 లొకేషన్స్ నుండి ‘గద్దలకొండ గణేష్’ $ 84,348 వసూలు చేసింది, ఓవరాల్ గా యూఎస్ లో ఈ సినిమా ఇప్పటివరకూ $ 249,082 డాలర్స్ ను సాధించింది. ఇక ఎలాగూ ఈ చిత్రం ఆదివారం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నే సాధిస్తోంది. అయితే సోమవారం నుండి ఈ సినిమాకి నిజమైన పరీక్ష ప్రారంభంకానుంది. అయితే సినిమా పక్కా మాస్ సినిమా కావడంతో యూఎస్ లో బలమైన ఓపెనింగ్స్ సాధించలేకపోయింది . హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు