త్రిగుణ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గగన్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జంగా’. ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద శ్రీమతి వనిత కిలారీ సమర్పణలో రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెవిన్ గడ్డం కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న గగన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు సంబంధించిన ప్రత్యేక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ సినిమాలో గగన్ బాబు సీఐ రోహిత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒక ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇటీవల హీరో త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు మంచి స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, త్వరలోనే మరిన్ని అప్డేట్‌లను ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.
ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా, వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రాఫర్‌గా మరియు ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు అందించిన ఈ సినిమాకు కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటలు రాస్తున్నారు. మధు నందన్, శివ నందన్, నాగ మహేష్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


