‘సైజ్ జీరో’లో కనిపించే స్టార్ సెలబ్రిటీస్ లిస్టు

‘సైజ్ జీరో’లో కనిపించే స్టార్ సెలబ్రిటీస్ లిస్టు

Published on Nov 16, 2015 12:10 PM IST

size-zero

ఈ ఏడాది భారీ బడ్జెట్ ఫిల్మ్స్ అయిన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించి సూపర్ హిట్స్ అందుకున్న యోగ బ్యూటీ అనుష్క నుంచి రానున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘సైజ్ జీరో’. ఈ సినిమాకి పూర్తి న్యాయం చేయడం కోసం అనుష్క తన పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగింది. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అనుష్క బ్రాండ్ వలన రోజు రోజుకీ ఈ సినిమాకి క్రేజ్ మరింత పెరుగుతోంది.

ఆర్య హీరోగా కనిపించనున్న ఈ సినిమాలో నాగార్జున అతిధి పాత్రలో కనిపించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. తాజాగా ఈ చిత్ర టీం చెప్పిన బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో ఒక్క నాగార్జునే కాకుండా మరికొందరు తెలుగు, తమిళ స్టార్ హీరోస్ మరియు హీరోయిన్స్ కూడా కనిపించనున్నారు. వారి వివరాల్లోకి వెళితే..

హీరోస్ : నాగార్జున, రానా రాగ్గుబాటి, రంగం ఫేం జీవలు అతిధి పాత్రల్లో కనిపించనున్నారు.
హీరోయిన్స్ : తమన్నా, కాజల్ అగర్వాల్, హన్సిక, లక్ష్మీ మంచు, శ్రీ దివ్య, రేవతిలు అతిధి పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు.

అనుష్క, ఆర్య,పివిపి కి వీరందరూ మంచి ఫ్రెండ్స్ సినిమాని సపోర్ట్ చేయడం కోసం వారంతట వారు ముందుకు వచ్చి సినిమాలో అతిధి పాత్రల్లో కనిపించి సినిమాకి ఇంకాస్త హైప్ ని పెంచారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు