ఆగస్ట్ 1న ‘గాల్లో తెలినట్టుందే’

ఆగస్ట్ 1న ‘గాల్లో తెలినట్టుందే’

Published on Jul 9, 2014 10:15 PM IST

Gallo-Telinattunde
‘గర్ల్ ఫ్రెండ్ కి మందు లేదు.. నివారణ ఒకటే మార్గం’ అంటూ కొత్త తరహ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ‘గాల్లో తెలినట్టుందే’. వెంకట సురేష్ దర్శకత్వంలో అజయ్, కుషి జంటగా నటిస్తున్నారు. ఇటివల ‘రా రా కృష్ణయ్య’ సినిమాతో విజయం అందుకున్న నిర్మాత సిహెచ్ వంశీకష్ణ శ్రీనివాస్ ఎస్వీకె సినిమా పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘గాల్లో తెలినట్టుందే’ ఆగస్ట్ 1న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సాయి కార్తీక్ అందించిన ఆడియోకు మంచి స్పందన లభించింది. సోలో, రా రా కృష్ణయ్య చిత్రాల తరహాలో ‘గాల్లో తెలినట్టుందే’ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించి తీసిన సినిమా. ప్రస్తుతం యువత ఆలోచనలు, వారి ప్రవర్తన ఎలా ఉన్నాయి అనే విషయాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. ఆగస్ట్ 1న విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, కృష్ణ భగవాన్, రఘుబాబు, కాశి విశ్వనాధ్, 30ఇయర్స్ పృథ్వీ, మెల్కోటే, గుండు సుదర్శన్ తదితర సీనియర్ కమెడియన్స్ ఈ సినిమాలో నటించారు.

తాజా వార్తలు