“గం గం గణేశా” ట్రైలర్ కి డేట్ ఫిక్స్!

“గం గం గణేశా” ట్రైలర్ కి డేట్ ఫిక్స్!

Published on May 18, 2024 6:00 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ హీరో తదుపరి గం గం గణేశా చిత్రం లో కనిపించనున్నారు. దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాత్సవ, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ పై సరికొత్త ప్రకటన చేయడం జరిగింది.

ఈ చిత్రం ట్రైలర్ ను మే 20, 2024 న సాయంత్రం 4:00 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు