థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరిస్తున్న “గం గం గణేశా” ట్రైలర్!

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరిస్తున్న “గం గం గణేశా” ట్రైలర్!

Published on May 20, 2024 4:27 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తదుపరి గం గం గణేశా చిత్రం లో కనిపించనున్నారు. ఈ క్రేజీ మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది.

ట్రైలర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ట్రైలర్ లో ఒక దొంగగా, లవర్ బాయ్ గా ఆనంద్ కనిపిస్తున్నారు. అయితే ట్రైలర్ ను చూస్తే ఇది ఒక కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. ట్రైలర్ లో చూపించిన కథ అంతా కూడా విగ్రహం చుట్టూనే ఉంది. ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యం గా ఆనంద్ దేవరకొండ మేకోవర్ చాలా బాగుంది. ట్రెండీ లుక్ లో అలరించారు.

ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తుండగా, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది అని చెప్పాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు