గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే హీరోయిన్ అంజలి ఫీమేల్ లీడ్ లో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “గేమ్ ఛేంజర్”. పలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేకపోయింది. అయితే ఎన్నో ఏళ్ళు పాటుగా తెరకెక్కించిన ఈ సినిమా అలా ఆలస్యం అవుతూనే వచ్చింది.
దీనితో పార్ట్ 2 కూడా తీస్తున్నారా అనే టాక్ కూడా వచ్చింది. ఆ రేంజ్ లో షూటింగ్ చేస్తూనే వచ్చారు. మరి ఈ సినిమాకి వర్క్ చేసిన ఎడిటర్స్ లో ఒకరైన షమీర్ ఇప్పుడు ఈ సినిమా రన్ టైం ఫుటేజ్ మీద అలాగే శంకర్ పై చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి.
ఈ చిత్రానికి ఏకంగా ఏడున్నర గంటల ఫుటేజ్ వస్తే శంకర్ దానిని 3 గంటలకి కుదించమంటే అలాగే చేసానని దానిని మరో ఎడిటర్ ఇంకా తగ్గించారని శంకర్ సర్ తో ఈ రకమైన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ తనకి నచ్చలేనిదని ఓపెన్ గానే తాను చెప్పేసాడు. అలాగే అనుకున్న దానికంటే సినిమా ఇంకా ఆలస్యం అవుతుండడంతో తను బయటకి వచ్చేసానని కూడా రివీల్ చేసాడు. దీనితో తన నుంచి ఈ షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
