‘గేమ్ ఛేంజర్’ : భారీ ధరకు అమ్ముడైన నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్

‘గేమ్ ఛేంజర్’ : భారీ ధరకు అమ్ముడైన నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్

Published on Apr 18, 2024 10:01 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ పొలిటికల్ పాన్ ఇండియన్ యాక్షన్ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏఏ ఫిల్మ్స్ అధినేత అనిల్ తడానీ కొనుగోలు చేశారనేది తెలిసిందే.

కాగా ఈ రైట్స్ ని ఆయన రూ. 75 కోట్లకు అడ్వాన్స్ ప్రాతిపదికన దక్కించుకోగా ఇది మంచి డీల్ అని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా మూవీని అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు