‘గేమ్ ఛేంజర్’ : చరణ్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అందించిన నిర్మాత దిల్ రాజు

‘గేమ్ ఛేంజర్’ : చరణ్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అందించిన నిర్మాత దిల్ రాజు

Published on Mar 28, 2024 12:34 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకోగా ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మాస్ సాంగ్ జరగండి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. విషయం ఏమిటంటే, నేడు బర్త్ డే జరుపుకుంటున్న రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని రామ్ చరణ్ యువత వారు హైదరాబాద్ లో నిర్వహించగా ఈ ఈవెంట్ కి ప్రత్యేకంగా విచ్చేసిన వారిలో ఒకరైన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, చరణ్ ఫ్యాన్స్ కి గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి సూపర్ న్యూస్ అందించారు.

మరొక రెండు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, 4 లేదా 5 నెలల్లో సినిమా విడుదల అవుతుందని అన్నారు. ఇక సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయని, శంకర్ సర్ తన స్టైల్ లో అన్ని పాటలను చాలా గ్రాండ్ గా డిజైన్ చేసారని తెలిపారు. ఐదు పాటల్లో మూడింటికి అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లలో ఎంతో ఎంజాయ్ చేస్తారని అన్నారు. మీరు ఈ రోజు జరగండి లిరికల్ వీడియోలో చూసినది కేవలం 2% మాత్రమే అని, జరగండి పాట థియేటర్లలో అభిమానులకు ట్రీట్ కానుందని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు