‘గేమ్ ఛేంజర్’ : రిలీజ్ పై రామ్ చరణ్ లేటెస్ట్ అప్ డేట్

‘గేమ్ ఛేంజర్’ : రిలీజ్ పై రామ్ చరణ్ లేటెస్ట్ అప్ డేట్

Published on Apr 14, 2024 3:02 AM IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

విషయం ఏమిటంటే, తాజాగా రామ్ చరణ్ కు తమిళనాడు లోని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ని ప్రధానం చేసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ వేల్స్ యూనివర్సిటీ వారి నుండి డాక్టరేట్ అందుకోవడం నిజంగా ఎప్పటికీ మరిచిపోలేని మధుర క్షణం అని అన్నారు. ఇక తన తాజా మూవీ గేమ్ ఛేంజర్ పొలిటికల్ యాక్షన్ మూవీ అని, అలానే దానిని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఐదు పాన్ ఇండియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీనితో ఈ మూవీ రిలీజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అయితే పక్కాగా రిలీజ్ డేట్ కి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు