‘గేమ్ ఛేంజర్’ : రిలీజ్ మరొక నెల వాయిదా ?

‘గేమ్ ఛేంజర్’ : రిలీజ్ మరొక నెల వాయిదా ?

Published on Apr 17, 2024 5:38 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చరణ్, దిల్ రాజు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా గేమ్ ఛేంజర్ తో పాటు పుష్ప 2, దేవర, కల్కి 2898 ఏడి మూవీస్ యొక్క నార్త్ రైట్స్ ని అనిల్ తడానీ దక్కించుకోవడంతో ప్రముఖ హిందీ క్రిటిక్ అండ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో ఆ విషయం పోస్ట్ చేసారు.

ఆ ట్వీట్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ ని నవంబర్ అని ఆయన యాడ్ చేయడంతో ఆ మూవీ యొక్క రిలీజ్ మరొక నెల వాయిదా పడిందనే అనుమానం అందరిలో మొదలైంది. అయితే పక్కాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ రావాల్సి అంటే మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వరకు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు