ఓటిటి లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళ్తున్న ‘గామి’

ఓటిటి లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళ్తున్న ‘గామి’

Published on Apr 16, 2024 12:59 AM IST

యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ యక్షన్ అడ్వెంచర్ మూవీ గామి. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా యువ దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించారు. కొద్దిరోజుల క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయిన గామి పర్వాలేదనిపించే విజయం అందుకుంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ 72 గంటల్లో మొత్తంగా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ ని సొంతం చేసుకుని దూసుకెళుతోంది. ఒకరకంగా ఓటిటి లో ఇవి రిమార్కబుల్ వ్యూస్ అని చెప్పాలి. కార్తీక్ శబరీష్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో అభినయ, మొహమ్మద్ సమద్, హారికా పెద్దాడ, శాంతి రావు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు