‘అఖిల్’కి హీరోయిన్ ఫిక్స్ అయిందా ?

‘అఖిల్’కి హీరోయిన్ ఫిక్స్ అయిందా ?

Published on Jul 29, 2019 3:50 PM IST

‘మిస్టర్ మజ్ను’కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. కాగా తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ఫిక్స్ అయింది. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే చాలమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు..

అయితే తాజా సమాచారం ప్రకారం ‘గ్యాంగ్ లీడర్’లో నటిస్తోన్న ప్రియాంక అరుల్ మోహన్ ను అఖిల్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోనున్నారట. అఖిల్ సరసన దాదాపు హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు