‘గ్యాంగ్ లీడర్’కి కొత్త విడుదల తేదీ ?

Published on Aug 8, 2019 2:29 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా – స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘గ్యాంగ్ లీడర్’. కాగా ఆగస్టు 30 న విడుదల కానున్న ఈ చిత్రం.. విడుదల తేదీని మార్చుకుందట. తాజాగా ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుందని తెలుస్తోంది. సాహో సినిమాకి లైన్ క్లియర్ చెయ్యడానికి ‘గ్యాంగ్ లీడర్’ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ కూడా రిలీజ్ కాబోతుంది. మరి ‘గ్యాంగ్ లీడర్’ ‘వాల్మీకి’ చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఏది ముందడుగులో ఉంటుందో చూడాలి.

ఇక గ్యాంగ్ లీడర్ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందట. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ చాల బాగుంటుందని.. కొన్ని కీలక సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయని సమాచారం. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :

More