గ్యాంగ్ లీడర్ వీకెండ్ నైజాం కలెక్షన్స్ రిపోర్ట్

Published on Sep 16, 2019 11:35 am IST

కామెడీ రివేంజ్ డ్రామాగా వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ బాక్సఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లు రాబడుతుంది. పాజిటివ్ రివ్యూస్ తో పాటు, వర్డ్ అఫ్ మౌత్ బాగా ఉండటంతో ఈ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. ఇక నైజాంలో గ్యాంగ్ లీడర్ మూవీకి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. అక్కడ మొదటిరోజు 1.67 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు శనివారం 1.49 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడవ రోజు ఆదివారం కూడా ఆ ఊపు కొనసాగించిన గ్యాంగ్ లీడర్ 1.53 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్ సాధించింది.

దీనితో మొత్తం మూడురోజులకు గాను నైజాంలో ఈ చిత్రం 4.69 కోట్ల షేర్ రాబట్టింది. ఈ వీకెండ్ ఘనంగానే ముగించిన గ్యాంగ్ లీడర్ ఇక నేటి నుండి ఏమేర ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. వచ్చే వారం వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి విడుదల నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ వసూళ్ళలో పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

సంబంధిత సమాచారం :

X
More