‘గ్యాంగ్ లీడర్’ రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ !

‘గ్యాంగ్ లీడర్’ రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ !

Published on Aug 19, 2019 3:56 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా – స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘గ్యాంగ్ లీడర్’. కాగా ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. సరికొత్త కంటెంట్ తో రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ చాల బాగుంటుందని.. నాని క్యారెక్టర్ చుట్టూ ఉండే పాత్రల ప్రభావం వల్ల, తనకు తెలియకుండానే నాని చేసే యాక్టివిటీస్ అలాగే కొన్ని కీలక సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయట.

ఇక ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ కూడా రిలీజ్ కాబోతుంది. మరి ‘గ్యాంగ్ లీడర్’ ‘వాల్మీకి’ చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఏది ముందడుగులో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు