గ్యాంగ్ లీడర్ యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ రిపోర్ట్

గ్యాంగ్ లీడర్ యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ రిపోర్ట్

Published on Sep 13, 2019 5:15 PM IST

నాని గ్యాంగ్ లీడర్ మూవీ నేడు విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు విక్రమ్ కుమార్ రివేంజ్ స్టోరీని ఎంటర్టైనింగ్ గా చెప్పిన విధానం బాగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. అలాగే హీరో నాని కామెడీ టైమింగ్ తో పాటు సీరియస్ సన్నివేశాలలో ఎమోషన్స్ పలికించి అందరిని అలరించారని తెలుస్తుంది. కాగా యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ పరంగా కూడా గ్యాంగ్ లీడర్ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం గ్యాంగ్ లీడర్ యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారా 177 లొకేషన్స్ నుండి $1,82,679 వసూళ్లు రాబట్టింది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వారంత సెలవులలో ఈ చిత్ర వసూళ్లు పెరిగే అవకాశం కలదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటించగా, సీనియర్ నటి లక్ష్మీ, శరణ్య ఇతర కీలకపాత్రలలో నటించడం జరిగింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు