గ్యాంగ్ లీడర్ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Sep 17, 2019 12:42 pm IST

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌ లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. కాగా ఈ సినిమా ఫస్ట్ షో నుండి పర్వాలేదనిపించే టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కోసం పోరాడుతోంది. కాగా తాజాగా ఈ సినిమా నైజాం కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. సోమవారం నాడు నైజాంలో 52 లక్షల షేర్ ను వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తం ఈ చిత్రం నాలుగు రోజులకు గానూ నైజాంలో రూ .5.21 కోట్ల షేర్ ను రాబట్టింది.

అయితే గ్యాంగ్ లీడర్‌ ను నైజాం పంపిణీదారుడికి దాదాపు రూ .8 కోట్లకు విక్రయించారు. సెప్టెంబర్ 20 న వరుణ్ తేజ్ వాల్మీకి రిలీజ్ నాటికీ.. గ్యాంగ్ లీడర్ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో చూడలి. అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో ఈ సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :

X
More