“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటైల్స్ ఇవే!

Published on May 27, 2024 8:01 PM IST

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది రాబోయే గ్రామీణ యాక్షన్ డ్రామా. ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా షెట్టి మరియు అంజలి ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. రిలీజైన ప్రచార చిత్రాలతో సినిమా పై మంచి అంచనాలను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు వచ్చాయి. మేకర్స్ ఇప్పుడు అదే విషయాన్ని ధృవీకరించారు.

రేపు N కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో, సాయి కుమార్, గోపరాజు రమణ, అయేషా ఖాన్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు