త్వరలో విశ్వక్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్..!

త్వరలో విశ్వక్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్..!

Published on Apr 17, 2024 1:19 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak sen) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari). ఈ చిత్రం ను మే 17, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నేడు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు. త్వరలో ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ కట్ సూపర్ గా వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం లో హీరో విశ్వక్ సేన్ లంకల రత్న అనే పాత్రలో నటిస్తున్నారు. తన రోల్ కి సంబందించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తి అయ్యింది. నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు