డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

Published on Jan 15, 2024 9:03 PM IST

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రం ను మార్చ్ 8, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా కి సంబందించిన డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ మంచి ధరకి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి మరొక కీలక పాత్రలో నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు