‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ : సీక్వెల్ పై నిర్మాత నాగవంశీ క్లారిటీ

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ : సీక్వెల్ పై నిర్మాత నాగవంశీ క్లారిటీ

Published on Apr 28, 2024 1:07 AM IST

యువ నటుడు విశ్వక్సేన్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మాస్ యాక్షన్ రూరల్ డ్రామా మూవీని యువ దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు ప్రత్యేక ఈవెంట్ లో భాగంగా టీజర్ ని రిలీజ్ చేసారు. మాస్ యాక్షన్ హంగులతో రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ కు అందరి నుండి మంచి రెస్సాన్స్ లభిస్తోంది.

విషయం ఏమిటంటే, ఈ ఈవెంట్ లో భాగంగా ఒక మీడియా పర్సన్ మాట్లాడుతూ, దీనికి సీక్వెల్ ఉంటుందా అని అడగగా తప్పకుండా ఉందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ మూవీ మే 17న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సాయి సౌజన్య తో కలిసి నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు