మాస్, యాక్షన్ హంగులతో అదిరిపోయిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్

మాస్, యాక్షన్ హంగులతో అదిరిపోయిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్

Published on Apr 27, 2024 6:06 PM IST

ఇటీవల యాక్షన్ అడ్వెంచర్ మూవీ గామి ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన యువ నటుడు విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగ వంశీ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ నుండి నేడు టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. మాస్ యాక్షన్ హంగులతో ఈ టీజర్ అదిరిపోయింది.

టీజర్ ని బట్టి చూస్తే తన కెరీర్ లో ఫుల్ మాస్ యాక్షన్ రోల్ లో విశ్వక్సేన్ అదరగొట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన డైలాగ్స్, యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ టీజర్ లో అదిరిపోయాయి. ‘అమ్మోరు పూనేసింది రా ఈసారి ఒక్కోక్కడికి శివాలెత్తిపోద్దంతే’ అంటూ విశ్వక్ పలికిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ మూవీ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచిందని చెప్పాలి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మే 17న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు