“గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు”లో విల‌న్‌ పాత్ర లో జ‌య‌సుధ త‌న‌యుడు నిహార్…ఫస్ట్ లుక్ విడుద‌ల‌!

Gangster gangaraju

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే క‌థానాయ‌కుడు ల‌క్ష్య్‌. వ‌ల‌యం వంటి గ్రిప్పింగ్‌ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఈ హీరో ఇప్పుడు త‌న‌దైన పంథాలో గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. రీసెంట్‌గానే ఈ సినిమాలో ల‌క్ష్య్ లుక్ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర‌యూనిట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ సినిమాలో విల‌న్‌ గా న‌టిస్తోన్న నిహార్ క‌పూర్ లుక్‌ను విడుద‌ల చేశారు. స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ త‌న‌యుడైన నిహార్‌, ఈ సినిమాతో విల‌న్‌గా ప‌రిచ‌యం అవుతుండ‌టం విశేషం.

మంగ‌ళ‌వారం నిహార్ క‌పూర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు యూనిట్ తన లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసింది. చేతిలో క‌త్తి ప‌ట్టుకుని, గ‌డ్డంతో ఉన్న నిహార్ లుక్ చూస్తుంటే భ‌యం గొలిపేలా ఉంది. క‌చ్చితంగా త‌న‌కు గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు న‌టుడిగా మంచి గుర్తింపు తెస్తుంద‌ని భావిస్తున్నారు నిహార్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. ఈ చిత్రం లో వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు నటిస్తున్నారు. ఇషాన్ సూర్య‌ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్‌ అందిస్తున్నారు.

Exit mobile version