గౌతమ్ మీనన్ చేతిలో సూపర్ స్టార్స్

గౌతమ్ మీనన్ చేతిలో సూపర్ స్టార్స్

Published on Nov 28, 2019 4:24 PM IST

Gautham Menon

స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నుండి వరుసగా సినిమాలు వచ్చి చాలా కాలమైంది. కొన్ని కారణాల రీత్యా ఆయన డైరెక్ట్ చేసిన ‘ధృవ నట్చత్తిరం, ఎనై నొక్కి పాయుమ్ తోట’ చిత్రాలు చాలా ఆలస్యంగా విడుదలవుతున్నాయి. ఈ పరిణామంతో ఇబ్బందిపడిన గౌతమ్ మీనన్ ఇకపై బ్రేకుల్లేకుండా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ప్లానింగ్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే రజనీకాంత్ యొక్క 169వ సినిమా అవకాశాన్ని దక్కించుకున్న ఆయన మరోక సూపర్ స్టార్ మోహన్ లాల్ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారని కొలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు చేతిలో ఉన్న గౌతమ్ మీనన్ ఇటీవలే ‘ఆదిత్య వర్మ’తో సినీరంగ ప్రవేశం చేసిన విక్రమ్ కుమారుడు ధృవ్ తో కూడా ఒక చిత్రం చేయాలని అనుకుంటున్నారట. అన్నీ ప్లానింగ్ ప్రకారం జరిగితే ఇంకో రెండేళ్లలో గౌతమ్ మీనన్ నుండి వరుస సినిమాల్ని చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు