
గౌతమ్ మీనన్.. ఈ దర్శకుడికి తెలుగు, తమిళ భాషల్లో ఉన్న ప్రత్యేక క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చేసే ప్రతీ సినిమాలో తనదైన బ్రాండ్‌ను చూపెడుతూ అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ దర్శకుడు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అంటూ ‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్‌ను రిపీట్ చేసే పనిలో ఉన్న గౌతమ్, ఆ సినిమా పూర్తైన వెంటనే రామ్ చరణ్ సినిమాకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ ప్రాజెక్టు విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని తెలిపారు. ఇక రామ్ చరణ్ దర్శకుడు శ్రీనువైట్లతో చేస్తోన్న బ్రూస్‌లీ వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. బ్రూస్‌లీ తర్వాత రామ్ చరణ్ కూడా తన తర్వాతి సినిమాను గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాస్‌లో మంచి క్రేజ్ ఉన్న రామ్ చరణ్, క్లాస్ డైరెక్టర్‌గా సూపర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న గౌతమ్ మీనన్ కాంబినేషన్ కచ్చితంగా ఓ మంచి క్రేజ్ ఉన్న కాంబినేషన్‌గానే నిలబడుతుందని చెప్పొచ్చు.

