గాయకుడిగా మారిన గౌతం మీనన్

గాయకుడిగా మారిన గౌతం మీనన్

Published on Feb 27, 2015 2:26 PM IST

gautham_vasudeva_menon
‘చెలి’, ‘ఘర్షణ’, ‘ఏం మాయ చేసావే’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు గౌతం మీనన్ ఇప్పుడు గాయకుడి అవతారమెత్తాడు. తెలుగులో ‘గౌరవం’ సినిమాని తీసిన రాధా మోహన్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘ఉప్పు కరువాడు’ సినిమాలో ఒక పాట పాడినట్టు సమాచారం. ఈ చిత్ర సంగీత దర్శకుడు స్టీవ్ ఎంతో కష్టపడి గౌతం చేత పాట పాడించడానికి అంగీకరించినట్టు సమాచారం.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ గౌతం గాన ప్రతిభ నాకు తెలుసని, పార్టీలలో పాడిన విధానం ఆశ్చర్యపరుస్తుందని తెలిపాడు. దర్శకులిద్దరికీ సంగీత దర్శకుడు మంచి స్నేహితుడు కావడంతో ఈ కాంబినేషన్ సాధ్యపడిందని తెలుస్తుంది. మదన్ రచించిన ఈ పాటలో జీవితం గురించి ఆలపించినట్టు సమాచారం

తాజా వార్తలు