మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి కలయికలో రూపొందిన ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అల్లు అరవింద్, శ్యాం ప్రసాద్ రెడ్డి, డివివి దానయ్య తదితర ప్రముఖులు, మూవీ యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
కుటుంబ బంధాలు, అనుభందాల నేపద్యంలో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా రూపొందించాం. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి అనేది మెయిన్ పాయింట్. కృష్ణవంశి గారు నాకు ఇలాంటి సినిమా అందించినందుకు కృతజ్ఞతలు. అక్టోబర్ 1న సినిమా విడుదల చేస్తున్నాం’ అని రామ్ చరణ్ అన్నారు. చిరంజీవి 150వ సినిమా తానే నిర్మిస్తున్నట్టు రామ్ చరణ్ మరోసారి చెప్పారు.


