మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడెలే’. ఈ సినిమాని అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. కానీ ఈ సినిమా రైట్స్ కోసం మాత్రం భారీ కాంపిటీషన్ నడుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నెల్లూరు రైట్స్ కోసం జరిగిన పోటీలో హరి పిక్చర్స్ వారు ఆల్ టైం రికార్డ్ ప్రైస్ కి ‘గోవిందుడు అందరివాడెలే’ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ‘గోవిందుడు అందరివాడెలే’ సినిమాలో మొత్తం 5 పాటలుంటాయి. అందులో ఇప్పటికే 2 పాటలను షూట్ చేసారు. రామ్ చరణ్ ఎన్నారైగా కనిపించనున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. కృష్ణవంశీ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.


