గీత గోవిందం ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గడం లేదు !
Published on Aug 18, 2018 11:58 am IST


విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల షేరును రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు పరుగులు తీస్తుంది. ఇక ఈచిత్రాన్ని ప్రేక్షకులకు చేరువచేయడానికి ఈఅదివారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో విజయోత్సవ వేడుకను నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు.

ఇక దీని తరువాత మా టి వి లో ప్రసారమవుతున్న బుల్లితెర గేమ్ షో బిగ్ బాస్ 2లో హీరో విజయ్, రష్మిక , పరుశురాం లు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. మరో 10 రోజుల వరకు పెద్ద సినిమాల విడుదలలేకపోవడంతో థియేటర్లలో గీత గోవిందం జోరు కొనసాగనుంది.

  • 5
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook